కేఎల్ రాహుల్.. టీమిండియా పరువు నీ చేతుల్లోనే?

praveen
సౌతాఫ్రికా టూర్ లో ఉన్న టీమ్ ఇండియా వరుసగా పరాజయాలతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి టెస్టు సిరీస్ టీమిండియా చేజార్చుకుంది. కనీసం వన్డే సిరీస్ అయినా విజయం సాధించి టీమిండియా పరువు నిలబెట్టుకుంటోంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుసగా రెండు మ్యాచ్లలో కూడా ఓటమి చవిచూసింది టీమిండియా. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను దక్షిణాఫ్రికా చేతిలో పెట్టేసింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే టీమిండియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి.

 అంతేకాదు మైదానంలో ఎక్కడా చురుకుగా కూడా కనిపించడం లేదు భారత ఆటగాళ్లు. అదే సమయంలో యువ ఆటగాడు కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం కూడా జట్టుకు మైనస్ గా మారిపోతుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓడి పోయి సిరీస్ కోల్పోయిన టీమిండియా మూడో మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చివరి మ్యాచ్లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకుంటుదా లేదా ఓటమి తోనే సౌతాఫ్రికా టూర్ ను టీమిండియా ముగించబోతుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

 అయితే మొదటి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ రెండవ వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మూడవ మ్యాచ్ లో మాత్రం టీమిండియాలో పలు మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నేడు మధ్యాహ్నం రెండు గంటలకు మూడో వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ప్రస్తుతం టీమిండియా లో ప్రధాన బౌలర్ గా ఉన్న జస్ప్రిత్ బూమ్రా కు విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మ్యాచ్ లలో ఘోరంగా విఫలమైన భువనేశ్వర్ స్థానంలో దీపక్ చాహర్ కు చాన్సు దొరికే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్  జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏం చేయబోతున్నాడు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: