షాకింగ్ : మూడో వన్డేకు విరాట్ కోహ్లీ దూరం?
కానీ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా ఎలాంటి అనుభవం లేని కె.ఎల్.రాహుల్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఎలా జట్టును ముందుకు నడిపిస్తాడో అని అనుమాన పడుతున్న సమయంలో వరుసగా రెండు వన్డే మ్యాచ్లలో ఓడిపోయింది టీమిండియా. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్షిణాఫ్రికా చేతుల్లో పెట్టేసింది. కాగా నేడు మూడో వన్డే మ్యాచ్ జరగబోతోంది. కనీసం ఈ వన్డే మ్యాచ్లో అయినా సరే టీమిండియా గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ప్రస్తుతం అనుమానంగా మారింది. అయితే ప్రస్తుతం జట్టు లో పలు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా టీమిండియా లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి మూడవ వన్డే మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వబోతున్నారట. గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోం.ది ఇక విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ నూ తీసుకోబోతున్నారట. ఇక విరాట్ కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడికి విశ్రాంతి ఇవ్వడం మాత్రం సరైన నిర్ణయం కాదు అని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మూడో మ్యాచ్లో టీమ్ ఇండియా ఏం చేయబోతుందో చూడాలి మరి.