అలాంటోడికి కెప్టెన్సీ ఇవ్వాలి : రవి శాస్త్రి

praveen
ఇటీవల ఎవరూ ఊహించని విధంగా విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఓటమి చవి చూడటం తో టెస్టు కెప్టెన్గా తప్పుకుంటున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత తర్వాత కెప్టెన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే పరిమిత ఓవర్ల ఫార్మట్ కి ఒక కెప్టెన్ టెస్టు ఫార్మాట్ కి మరొక పేరు ఉంటే బాగుంటుందని అప్పట్లో బీసీసీఐ చెప్పింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ను పరిమిత ఓవర్ల ఫార్మాట్ కే పరిమితం చేసి టెస్ట్ ఫార్మట్ కి కొత్త కెప్టెన్ ఎంపిక చేయబోతున్నారు అంటూ చర్చ మొదలైంది.


 అదే సమయంలో ఫిట్ నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ కాకుండా ఫిట్నెస్ ఎక్కువగా ఉండే ఆటగాడికి కెప్టెన్సీ అప్పగిస్తే బెటర్ అంటూ మరికొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ రిషబ్ పంత్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే భారత పేసర్ జస్ప్రిత్ బూమ్రా పేరు కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం. కెప్టెన్సీ వస్తే సమర్థవంతంగా నిర్వహిస్తా అంటూ గతంలో జస్ప్రిత్ బూమ్రా చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.  బుమ్రా కు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం విషయంలో విభేదించాడు రవి శాస్త్రి.


 జస్ప్రిత్ బూమ్రా కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలి అనడం సరికాదు. నాకైతే ఎప్పుడూ అలాంటి ఆలోచన కూడా రాలేదు. భారత జట్టులో పోటీ ఎంతో తీవ్రంగా ఉంటుంది. జట్టులో స్థానం కోసం ఎదురు చూసె ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే టీమిండియాలో ఫాస్ట్ బౌలర్లు సుదీర్ఘకాలం పాటు జట్టులో కొనసాగడం చాలా కష్టం. జట్టులో కీలక మైన బౌలర్ గా ఉన్న ఒక ఆటగాడు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్ గా వ్యవహరించడం అనేది ఎంతో కష్టమైన పని ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ గా ఉండాలంటే బ్యాటింగ్ లో కూడా రాణించాల్సి ఉంటుంది. అందుకే కపిల్ దేవ్ లాంటి ఒక నికార్సైన ఆల్ రౌండర్ కు కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తం చేశాడు రవి శాస్త్రి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: