చెన్నై చేరుకున్న ధోని.. దేనికోసం అంటే?

praveen
భారత క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులు అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్కు దూరం అయినప్పటికీ అటు దేశవాళీ టోర్నీ ఐపీఎల్ లో మాత్రం సత్తా చాటుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా దూసుకు పోతున్నాడు అనే చెప్పాలి. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం గమనార్హం.


 అయితే ఇక ఐపీఎల్ మొదలైన నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతో పటిష్టంగానే  కనిపించింది. కానీ ఇటీవలే ఐపీఎల్లో కి రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లు అందర్నీ కూడా మెగా వేలం లోకి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుని ఇక మిగతా ఆటగాళ్లు అందర్నీ కూడా మెగా వేలం లోకి వదిలేసాయి అన్ని జట్లు. ఇక మరికొన్ని రోజుల్లో మెగా వేలం జరగబోతుంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరులో వేదికగా మెగా వేలం జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.


 ఈ మెగా వేలంతో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని మళ్లీ జట్టును పటిష్టంగా మార్చుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల చెన్నై చేరుకున్నాడు. మెగా వేలంలో వ్యూహాలపై యాజమాన్యంతో చర్చించేందుకు ధోనీ చెన్నై వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా రవీంద్ర జడేజా, ధోని, మోయిన్ అలీ, రుతూరాజ్ లను  సిఎస్కే జట్టు రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలోనే అటు జట్టు యాజమాన్యం తో పాటు మహేంద్ర సింగ్ ధోనీ కూడా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికలో సహాయం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: