అతని చేతుల్లో.. భారత క్రికెట్ సురక్షితంగా ఉంది?
ఇంకేముంది ఆ మొన్నటి వరకు తాత్కాలిక కెప్టెన్ గా, వైస్ కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ శర్మకు వన్డే టి20 ఫార్మాట్లకు సంబంధించిన కెప్టెన్సీ పగ్గాలు చేతిలోకి వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో సౌత్ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఓడిపోయిన తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. దీంతో టెస్ట్ ఫార్మాట్ కి కూడా రోహిత్ శర్మ కెప్టెన్ అవబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ కావడంతో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ శర్మ తన కెప్టెన్సీ ప్రతిభను చాటుకున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇప్పుడు ఇదే విషయంపై వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ చేతుల్లో భారత క్రికెట్ ఎంతో సురక్షితంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభను అందరూ చూశారని... అద్భుతంగా రాణించాడు అంటూ డారేన్ సామి వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఎంతో స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ అని.. ధోని లాంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించుకునే సామర్థ్యం కలిగి ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవల గాయం బారిన పడి జట్టుకు దూరమైన రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.