రవిశాస్త్రి 2.0.. అస్సలు అర్థం కావట్లేదు?

praveen
విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు ఓకే కెప్టెన్  ఉంటే బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేసిన బీసీసీఐ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం.. మొన్నటివరకు టెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కొనసాగిన విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓడిపోయిన వెంటనే  టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నారు అంటూ ప్రకటించడం అంతా చకచకా జరిగిపోయాయ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం గురించే ప్రస్తుతం  అంతా చర్చ జరుగుతోంది. భారత మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు సైతం ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే గతంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్ చేశాడు అన్న విషయం తెలిసిందే. కోహ్లీ ఖచ్చితంగా మరో రెండేళ్లపాటు కెప్టెన్గా ఉండేవాడని.. రానున్న రోజులో భారత జట్టు ఆడబోయే సిరీస్ లన్ని స్వదేశంలోనే కాబట్టి టెస్ట్ ర్యాంకింగ్స్ లో అట్టడుగు స్థానంలో ఉన్న జట్లతోనే కాబట్టి అతడు మరికొంత కాలం కొనసాగే ఈ అద్భుతమైన విజయాలు సాధించేవాడు అంటూ రవి శాస్త్రి  వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ సాధించిన ఘనతను జీర్ణించుకోలేక అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి.. కెప్టెన్సీ  వదులుకునేలా చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.


 ఇక రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ రవిశాస్త్రి కామెంట్స్ ని తప్పుపట్టాడు. రావిశాస్త్రిని విమర్శించాలని ఆలోచన నాకు అస్సలు లేదు. అతని కెప్టెన్సీలో అప్పుడు నేను కూడా ఆడాను.. అతడికి పెద్ద అభిమానిని కూడా.. కెప్టెన్గా ఉన్నప్పుడు అతను ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే వాడు. కానీ రవిశాస్త్రి 2.0  మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పుడూ అతను తెలివైన వ్యాఖ్యలు మాత్రం చేయడు. అతని కామెంట్ వెనుక మర్మమేమిటో కూడా అందరికీ అర్థమైపోతుంది. ఇలాంటిది భారత క్రికెట్ లో అస్సలు మంచిది కాదు అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: