ఓరి దేవుడా.. 29 ఏళ్ళకే క్రికెట్కు గుడ్ బై చెప్పాడు?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న వారు రిటైర్మెంట్ ప్రకటించడం అంటే దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాతే. ఇటీవలి కాలంలో ఎంతో మంది ఆటగాళ్లు 40 ఏళ్ళ వయస్సులో కూడా మంచి ఫిట్నెస్  మెయింటైన్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులందరికీ షాక్ ఇస్తున్నారు. ఇలా రిటైర్మెంట్ ప్రకటిస్తున్న వారిలో 30 ఏళ్లు దాటని ఆటగాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇటీవల శ్రీలంక క్రికెట్ లో పలువురు ఆటగాళ్లు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.


 ఇక ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నెదర్లాండ్ స్టార్ క్రికెటర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరికీ షాకిచ్చాడు. అంతర్జాతీయ జట్టుకు పదేళ్ళపాటు ప్రాతినిథ్యం వహించిన బెన్ కూపర్  తన ఆట తో అద్భుతమైన ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. 2013లో కెనడా తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బెన్ కూపర్ 29 ఏళ్లకె అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఆటగాడు. కొన్ని రోజుల్లో నేను ముప్పై లోకి అడుగు పెట్టబోతున్న.. పదేళ్లపాటు డచ్ క్రికెట్కు ఎంతగానో సేవలందించాను.. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు మాకు పెద్దగా అవకాశాలు రావు.. పంచ కప్ లాంటి పెద్ద టోర్నీలో మాత్రమే ఎక్కువ మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఇప్పుడు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తే కొత్త ఆటగాళ్ళకు ఛాన్స్ వస్తుంది. విధి లేక ఆటకు గుడ్బై చెబుతున్న... ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను అంటూ 29 ఏళ్ల బెన్ కూపర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అయితే నెదర్లాండ్స్ తరఫున అత్యధిక టీ20 లో ఆడిన ఆటగాడిగా బెన్ కూపర్ కొనసాగుతున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: