వైరల్ : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం?
ట్రినిడాడ్ వేదికగా క్వీన్స్ పార్క్ మైదానంలో ఐర్లాండ్ జింబాబ్వే జట్ల మధ్య ఇటీవలే మ్యాచ్ జరిగింది. ఇక మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో దాదాపు 20 సెకండ్ల పాటు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.2 గా నమోదయినట్లు తెలుస్తోంది. భూకంపం జరిగిన సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లకు మాత్రం ఈ విషయం తెలియక పోవడం గమనార్హం. జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ జరుగుతున్న సందర్భంలో ఇక ఈ భూకంపం. సంభవించినట్లు తెలుస్తోంది అయితే ఇలా భూకంపం ఏర్పడింది అన్న విషయం కామెంటేటర్ చెప్పడం తో బయటికి వచ్చింది.
అయితే భూకంపం సంభవించిన సమయానికి కెమెరాలు షేక్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. అయితే ఇక క్రికెట్ మ్యాచ్ విషయానికి వస్తే జింబాబ్వేపై ఐర్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 48.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 33 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఐర్లాండ్ జట్టు విజయం సాధించింది.