ధోని నా భార్య కాదు.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్?

praveen
టీమిండియాలో ఎన్నో ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన హర్భజన్ సింగ్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇకపోతే ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసిన హర్భజన్ సింగ్ ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బిసిలను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు హర్భజన్ సింగ్. భజ్జీ చేసిన వ్యాఖ్యలు కాస్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సీనియర్ల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు అంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.


 ఎలాంటి వివరణ కూడా ఇవ్వకుండానే సీనియర్లకు కనీసం గౌరవం ఇవ్వకుండా అకారణంగా జట్టు నుంచి పక్కకి తప్పించాడు అంటూ కామెంట్స్ చేశాడు హర్భజన్ సింగ్. తనతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, వి.వి.ఎస్.లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ లాంటి ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు తుది జట్టులో చోటు దక్కించుకోవడం కోసం ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితులను ధోని కల్పించాడు అంటూ మనసులో ఉన్న బాధ బయట పెట్టాడు. ఇక ఇదంతా జరగడానికి అప్పుడు బిసిసిఐ పెద్దలలో కొంతమంది ధోనీకి సహకరించారు సంచలన వ్యాఖ్యలు చేశాడు హర్భజన్ సింగ్.



 ఇక నాలాంటి ఆటగాడికి భారత క్రికెట్ బోర్డుతో గాడ్ఫాదర్ లాంటి వారు ఎవరూ లేకపోవడం వల్ల ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ధోని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్ తనకు మాజీ కెప్టెన్ ధోనీ తో ఎలాంటి విభేదాలు లేవని.. అలా ఉండడానికి నా భార్య కాదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. ధోనీ ఉన్నత శిఖరాలు చేరే సమయానికి తాను టెస్టుల్లో 400కు పైగా వికెట్లు సాధించిన రికార్డు చేరుకున్నానాని సీనియర్ గా ఉన్న తనకు ఎలాంటి వివరణ కుండానే జట్టు నుండి తప్పించడం గుర్తు చేసుకున్నాడు. ఒకవేళ తనకు బిసిసిఐ పెద్దల నుంచి మద్దతు వుండివుంటే 60 వరకు వికెట్లు తీసే వాడిని.. అప్పటి సెలెక్టర్లు  విశ్రాంతి పేరుతో సీనియర్ల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరించేవారు అంటూ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: