ఐపీఎల్ మెగా వేలం: కోట్లు కొల్లగొట్టే 3 స్పిన్నర్లు వీరే?

VAMSI
గత నెల రోజుల ముందు నుండి క్రికెట్ ప్రేమికులు అంతా ఐపీఎల్ గురించి ఆలోచిస్తున్నారు. ఐపీఎల్ ఇప్పటి వరకు విజయవంతంగా 14 సీజన్ లను పూర్తి చేసుకుని 15 వ సీజన్ లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వెన్యూ మరియు మిగిలిన ఏర్పాట్లను బీసీసీఐ చూసుకుంటోంది. మొత్తం మ్యాచ్ లను ముంబైలోనే జరిపేటట్లుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంకో 10 రోజులలో ఐపీఎల్ మెగా వేలం బెంగుళూరు లో జరగనుంది. ఇందులో ఎవరెవరు ఎంత మొత్తానికి అమ్ముడు కానున్నారు అనే విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ బయట నడుస్తూ ఉంది. ఈ ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే స్పిన్నర్లు ఎవరు? అయితే ప్రస్తుతం గత సంవత్సర కాలంగా ఆయా స్పిన్నర్ల ప్రదర్శన బట్టి ముఖ్యంగా ముగ్గురు మాత్రం ఎక్కువ మొత్తానికి అమ్ముడు అవుతారు అని క్రికెట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

తబ్రైజ్ శంసి

ఇందులో మొదటిగా వినిపిస్తున్న పేరు సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ శంసి. శంసి బౌలింగ్ శైలి మరియు బ్యాత్సమం స్టైల్ ను బట్టి బౌలింగ్ చేసే విధానం అందరినీ ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ఇతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఏ మాత్రం బాల్ ని ఆడడం మిస్ చేశారా వికెట్ పక్కా... అంతలా తన బౌలింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో శంసి ఈ ఐపీఎల్ వేలంలో అన్ని జట్లకు మొదటి ఆప్షన్ గా మారే అవకాశం ఉంది...
అదిల్ రషీద్
ప్రస్తుతం ఇంగ్లాండ్ టీమ్ లో టాప్ స్పిన్నర్ ఎవరంటే అది ఒక్క రషీద్ అనే చెప్పాలి. గత కొంతకాలముగా నిలకడగా వికెట్లు తీయలేకపోయినా మంచి ఎకానమీ రేట్ తో బ్యాట్సమన్ కు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఈ సారి ఐపీఎల్ వేలంలో రషీద్ కు మంచి ధర పలికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాగా ౨౦౨౧ లో విడుదల చేసిన టీ 20 బౌలర్ ర్యాంకింగ్ లో అదిల్ రషీద్ 4 వ స్థానంలో ఉన్నాడు.
ఆడం జంపా
ఆస్ట్రేలియా యువ సంచలనం ఆడం జంపా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా తన యొక్క స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్మన్ కు చుక్కలు చూపిస్తూ ఉంటాడు. ఇటీవల ముగిసిన బిగ్ బాష్ లీగ్ లోనూ ఆడిన కొద్దీ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఇతని లెగ్ స్పిన్ ను ఆడడం చాలా కష్టం అని చెప్పాలి. ఎక్కువగా పవర్ ప్లే లో వికెట్లు తీయడంలో జంపా దిట్ట. ఇతనిని కొనడానికి కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
మరి చూద్దాం ఏ స్పిన్నర్ ఎంత ధరకు అమ్ముడు అవుతారో...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: