RCB నన్ను తీసుకున్న ధరకు ఆశ్చర్యపోయా : కోహ్లీ

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ భారత క్రికెట్ కు తలమానికంగా మారిపోయింది అని చెప్పాలి. ఎంతలా అంటే ప్రస్తుతం భారత జట్టు లోకి ఎంట్రీ ఇస్తున్న ఫ్యూచర్ స్టార్స్ అందరూ ఐపీఎల్లో సత్తా చాటుతున్న వారే కావడం గమనార్హం. ఇక ఇప్పుడు భారత క్రికెట్ లో సీనియర్ లుగా ఉన్నవారు కూడా ఒకప్పుడు ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి యువ ఆటగాళ్లు గా రాణించిన వారరే. ఇలాంటి వారిలో అటు మొన్నటి వరకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ కూడా ఉండడం గమనార్హం. 2008 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అక్కడినుంచి అదే జట్టుతో కొనసాగాడు.


 ఇటీవలే విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆర్ సి బి ఫ్రాంచైజీ తమ ఆటగాళ్ళందరూ మాట్లాడిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ తమను ఎలా మార్చింది అనే విషయాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఐపీఎల్ వేలం జరిగినప్పుడు అండర్ 19  ప్రపంచ కప్ లో మలేషియాలో నేను ఉన్నాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.. ఆ సమయంలో నన్ను ఎంత ధరకి తీసుకోవాలని అనుకున్నారో తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.


 అది తక్కువ అమౌంట్ కాదు చాలా పెద్ద మొత్తం.. గతంలో 25 లక్షలకు కొన్నారు. బెంగళూరు జట్టు నన్ను జట్టులోకి తీసుకోవడం నా జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇక బెంగళూరు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన నేను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంటాని కలలో కూడా ఊహించలేదు. నాకు మాటలు ఊరుట కన్న నిజాయితీగా ఉండడం ఇష్టం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక నేను ఐపీఎల్ ఆడే చివరి రోజు వరకు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతారు విరాట్ కోహ్లీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: