ఐపీఎల్ నా జీవితాన్ని మార్చేసింది : యువ బౌలర్
ముఖ్యంగా భారత అప్‌కమింగ్ స్టార్స్ అందరికీ కూడా ఐపీఎల్ ఒక బంగారుపల్లెంలా మారిపోయింది అని చెప్పాలి. ఐపీఎల్ లేనప్పుడు దేశవాళీ టోర్నీల్లో రాణించిన ఆటగాళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఐపీఎల్ లో ఎవరు బాగా రాణిస్తున్నారో వారినే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం కల్పిస్తున్నారు సెలెక్టర్లు. ఇలా ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న సీనియర్ల నుంచి మొన్న మొన్న వచ్చిన జూనియర్ల వరకు అందరూ ఐపీఎల్ లో సత్తా చాటి ఛాన్స్ కొట్టేసిన వారే ఉండటం గమనార్హం. నా కెరీర్ కూడా ఐపీఎల్ వల్లే మారిపోయింది అంటూ చెబుతున్నాడు యువ బౌలర్ ఆవేష్ ఖాన్.
ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. గత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్ లో ఆవేష్ ఖాన్ టీమ్ ఇండియాకు ఎంపిక అయినప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కొన్ని రోజుల్లో వెస్టిండీస్‌తో జరగబోయే టి20 సిరీస్ లో మరో సారి ఛాన్స్ కొట్టేశాడు ఇక ఈ సారి తుది జట్టులో స్థానం దక్కుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆవేష్ ఖాన్.కాకా గత సీజన్ లో అద్భుతంగా రాణించి ఏకంగా ఇరవై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.