గుర్తుపెట్టుకోండి.. అందరూ ఆశ్చర్యపోతారు : హార్దిక్ పాండ్య

praveen
ఆడు.. ఆడు.. నువ్వు ఆడితే బాగుంటుందబ్బా.. నువ్వు సిక్సర్ కొడితే ఆ సంతోషం అబ్బో మాటల్లో చెప్పలేం.. అవును హార్దిక్ పాండ్యా ఆటను చూస్తూ ఉంటే ప్రతి క్రికెట్ ప్రేక్షకుడికి ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రేక్షకులు ఒక్కో క్రికెటర్ నీ అభిమాని ఇస్తూ ఉంటారు. కానీ అందరూ క్రికెటర్ల అభిమానులు హార్దిక్ పాండ్యను అభిమానిస్తారు అంతలా తన ఆటతో గుర్తింపును సంపాదించుకున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి సరిగ్గా సరిపోయే హార్దిక్ పాండ్యా చూడటానికి బక్క పలచగా ఉన్న కొట్టే సిక్సర్లు మాత్రం స్టేడియం దాటి పోతుంటాయి.



 అంతే కాదు ఒక్కసారి మైదానంలోకి వచ్చాడు అంటే ధనా ధన్ ఫటా ఫట్ అనే రేంజ్ లో ఇరగ ఇస్తూ ఉంటాడు. ఎలాంటి బంతినైనా సరే బౌండరీకి తరలించి
 గల సత్తా ఉన్నోడు హార్దిక్ పాండ్యా. ఇక హార్దిక్ పాండ్యా క్రీజులో ఉంటే ఎలాంటి బంతి వేయాలో తెలియక బౌలర్లు కూడా తికమకపడుతుంటారు. ఇలాంటి స్టార్ ఆల్రౌండర్  గత కొంత కాలం నుంచి బౌలింగ్ పూర్తిగా దూరం అయిపోయాడు.. భుజం గాయం కారణంగా బౌలింగ్  చేయలేదు. దీంతో బీసీసీఐ అతనిపై వేటు వేయడంతో మళ్ళీ ఫిట్నెస్ పై దృష్టి సాధించాడు.


 అదే సమయంలో మొన్నటివరకు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగిన హార్దిక్ పాండ్యా కు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం ప్రమోషన్ వచ్చేసింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా మారాడు. ఇటీవలే అభిమానులతో చిట్ చాట్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఈసారి బౌలింగ్ చేస్తారా అంటూ అడుగగా.. గుర్తుపెట్టుకోండి బౌలింగ్తో ఆశ్చర్యపోతారు అంటూ సమాధానం చెప్పాడు. నిజాయితీగా పని చేస్తానని ఫలితం అదే వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీకి  కొత్త అయినప్పటికీ ధోనీ కోహ్లీ రోహిత్ ల నుంచి కొన్ని విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతా అంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: