ఐపీఎల్ వేదికపై.. సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు?
కానీ సోషల్ మీడియా లో మాత్రం ఐపీఎల్ నిర్వహణ గురించి రోజుకొక వార్త తెరమీదికి వస్తూనే ఉంది. ఈసారి ఐపీఎల్ ను భారత్ విధిగా నిర్వహించాలి అని అనుకోవడం లేదని.. శ్రీలంక లేదా యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ఫిక్స్ అయింది అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అభిమానులు అందరూ కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2022 ఇండియాలోనే జరుగుతుందని స్పష్టం చేశారు ఆయన.
వైరస్ కారణంగా నిర్వహించలేని పరిస్థితులు వస్తే తప్పా ఈసారి ఐపీఎల్ ను ఇండియాలో నిర్వహించి తీరుతాం క్లారిటీ ఇచ్చారు. ముంబై పూణే లో లీగ్ మ్యాచ్లను జరుపుతాం అంటూ తెలిపారు. ఇక అహ్మదాబాద్లో మ్యాచ్ లు నిర్వహించడం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఏప్రిల్ మేలలో పరిస్థితులను బట్టి ఇక నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా భారత్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో పెరగకపోవడంతో ఈసారి ఐపీఎల్ భారత్ వేదికగానే జరగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
కాగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.