నేడే ఫైనల్.. విజయోస్తు అంటున్న ఇండియా?
వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్ వరకు దూసుకు వచ్చింది. ఇప్పటికే అండర్-19 ప్రపంచ కప్ లో ఎన్నో సార్లు సత్తాచాటిన టీమిండియా ఈ సారి కూడా తిరుగు లేదు అని నిరూపించింది. భారత కుర్రాళ్ల ప్రదర్శనకు యావద్భారత మొత్తం గర్విస్తుంది అని చెప్పాలి. కాగా నేడు ఇంగ్లాండ్ జట్టుతో సాయంత్రం ఆరున్నర గంటలకు ఫైనల్ పోరులో తలబడ బోతుంది టీమిండియా. కాగా ఇప్పటివరకు గణాంకాలు చూసుకుంటే ఏడు సార్లు ఫైనల్ కి వచ్చిన టీమిండియా నాలుగు సార్లు విజయం సాధించింది. మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఎనిమిదో ఒకసారి ఫైనల్లో అడుగు పెట్టింది అండర్-19 టీమిండియా జట్టు.
ఎలాగైనా ఫైనల్లో విజయం సాధించి భారత్ కు ఐదో వన్డే వరల్డ్ కప్ అందించాలని కెప్టెన్ యష్ దుల్ నేతృత్వం లోని యువ భారత్ దృఢ సంకల్పం తో ఉంది. అదే సమయం లో అటు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు కూడా అద్భుతం గా రాణిస్తుంది అని చెప్పాలి. అందుకే ఇంగ్లాండ్ కూడా ఫైనల్ వరకు చేరుకో గలిగింది. ఈ క్రమం లో నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారబోతుంది అన్నది అర్థమైంది ఇక ఇలాంటి సమయంలోనే విజయోస్తు అంటూ భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కుర్రాళ్ల జట్టుకు ఆశీర్వచనాలు అందిస్తున్నారు.