అండర్- 19 కుర్రాళ్లకు.. సౌరవ్ గంగూలి బంపర్ ఆఫర్?

praveen
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన అండర్-19 ప్రపంచకప్ ముగిసింది. ఇక ఈ ప్రపంచ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోయింది.. ఇక ఈ వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు చేసిన ప్రదర్శనకు క్రికెట్ ప్రపంచం మొత్తం మంత్రముగ్దులు అయ్యారు అని చెప్పాలి. కుర్రాళ్ళు అయినప్పటికీ ప్రపంచకప్లో ఎంతో పరిపక్వత తో సమన్వయంతో సమిష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. చివరికి టీమిండియా విశ్వ విజేతగ నిలపడంలో కీలక పాత్ర వహించారు. కెప్టెన్ యష్ దుల్ ఎక్కడ ఒత్తిడికి లోనుకాకుండా సమర్ధవంతంగా  జట్టును ముందుకు నడిపించాడు అని చెప్పాలి.


 ఇక ఇటీవల శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఉత్కంఠభరితమైన 9 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ లో వరుస విజయాలతో దూసుకుపోయి ఫైనల్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ టీమ్ ఇండియా జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది   అయితే ఇప్పటికే వరుస మ్యాచ్ లలో ప్రత్యర్థులపై పైచేయి సాధించిన టీమిండియా ఇక ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగించింది. ప్రత్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా బౌలింగ్లో బ్యాటింగ్ లో కూడా రాణించింది టీమిండియా. ఐదో సారి అండర్-19 ప్రపంచ కప్ ను ముద్దాడింది కుర్రాళ్ళ జట్టు.


 ఇక అండర్-19 ప్రపంచ కప్ గెలవడంపై కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రపంచకప్ గెలిచి భారత విశ్వవిజేతగా నిలిచిన ఆటగాళ్లకు సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించాడు సౌరవ్ గంగూలీ. ప్రపంచ కప్ విజయంలో సిబ్బంది సెలెక్టర్లు కూడా భాగస్వాములే అని పేర్కొన్నాడు  ఇక ఒక్కో క్రికెటర్ కి 40 లక్షలు.. సిబ్బందికి 20 లక్షలు బీసీసీఐ తరఫున బహుమతిగా ఇస్తున్నట్లు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక సౌరవ్ గంగూలీ తీసుకున్న నిర్ణయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: