నేను బుల్లెట్లు కాల్చితే.. మావాడు వికెట్లు కూల్చాడు?

praveen
ఇటీవలే భారత అండర్-19 కుర్రాళ్లు అద్భుతమైన విజయాన్ని సాధించారు. జట్టులోని ఆటగాళ్లు అందరూ సమిష్టిగా రాణించి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ చివరికి ఫైనల్ మ్యాచ్లో కూడా విజయం సాధించి టీమిండియాను విశ్వవిజేతగా నిలిపారు. ఈ క్రమంలోనే యష్ దుల్ కెప్టెన్సీలోని అండర్ 19 జట్టు మొదటిసారి వన్డే ప్రపంచకప్ అందుకుంది. టీమిండియాకు ఇది 5వ ప్రపంచ కప్ అన్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రపంచ కప్ సాధించిన నేపథ్యంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



 ఇక ఒక్కో క్రికెటర్ ఎలాంటి స్థాయి నుంచి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడో అన్న స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అండర్ 19 ప్రపంచ కప్ లో అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడు ఉత్తరప్రదేశ్కు చెందిన రవి కుమార్. ఇక ఫైనల్ మ్యాచ్లో  నాలుగు వికెట్లు తీసి అద్భుతమైన  ప్రదర్శనతో ఇరగదీశాడు. కాగా రవికుమార్ ఇలా మంచి క్రికెటర్ స్థాయికి ఎదగడానికి కుటుంబ  త్యాగం కూడా ఎంతో ఉంది అన్నది అర్ధమవుతుంది.  కాగా రవి కుమార్ తండ్రి రజిందర్ సింగ్ సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఇటీవలే తన కొడుకు ప్రపంచకప్ హీరోగా మారిపోవడంతో రాజిందర్ సింగ్ ఆనందంలో మునిగిపోయారు.


 నేను బుల్లెట్లు కాల్చుతూ దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉన్నాను.  నా కుమారుడు అతని బౌలింగ్తో వికెట్లు కూల్చుతు టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు రవి కుమార్ తండ్రి రాజిందర్. కాగా ప్రస్తుతం  ఒడిశాలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన రాయగడ జిల్లా సిఆర్పిఎఫ్ జవాన్ గా కొనసాగుతున్నారు ఆయన.  ఇటీవలే తన అనుభవాలను కూడా పంచుకున్నాడు.  గతంలో 2006లో శ్రీనగర్లో విధుల్లో ఉండగా మిలిటెంట్ల దాడి జరిగిందని  బుల్లెట్ గాయానికి గురయ్యానని.. ఈ కష్టాలన్నీ కుటుంబ సభ్యుల వద్ద ఎప్పుడు ప్రస్తావించ లేదంటూ రజిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: