ధోని లాగే కోహ్లీ మాస్టర్ ప్లాన్.. వికెట్ దక్కింది?
ఇక ఇప్పుడు చెప్పినట్లుగానే విరాట్ కోహ్లీ నాయకుడిగానే వ్యవహరిస్తున్నాడు అన్నది తెలుస్తుంది. కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కు విలువైన సలహాలు ఇస్తూ ఆటగాళ్లకు కూడా సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇటీవలే మొదటి వన్డే సమయం లో ఒక డిఆర్ఎస్ సమయం లో కెప్టెన్ రోహిత్ శర్మకు సలహా ఇచ్చి టీమిండియాకు వికెట్ దక్కేలా చేశాడు విరాట్ కోహ్లీ. ఇక వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయం లో కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నాడు. బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ కొనసాగుతున్నారు.
ఇలాంటి సమయంలో ఇక కీరన్ పొలార్డ్ వీకెట్ తీసుకోవడానికి ధోని తరహాలోనే మాస్టర్ ప్లాన్ వేసాడు విరాట్ కోహ్లీ. ఉల్టా వాలా దాల్ బిందాస్ దాల్ అంటూ చాహల్ కు ఒక సలహా ఇవ్వడంతో ఇక కోహ్లీ చెప్పినట్లుగా బంతిని విసిరాడు చాహల్. కిరణ్ పోలార్డ్ వికెట్ తీసి గోల్డెన్ డక్ గా అతన్ని పెవిలియన్ పంపించాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత విరాట్ కోహ్లీ చెప్పినట్లుగానే కెప్టెన్సీ లేకపోయినప్పటికీ జట్టుకు నాయకుడిగానే కొనసాగుతున్నాడు అని అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు.