వరుస బౌండరీలు.. అప్పుడు సిరాజ్ ఏం చేసాడో చూడండి?
అయితే ఇక వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో అటు చాహల్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక మరోవైపు మహమ్మద్ సిరాజ్ కూడా తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో మహమ్మద్ సిరాజ్ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్పెస్ క్రియేట్ చేస్తున్నాడు.. అంతేకాకుండా ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు మహమ్మద్ సిరాజ్. ఈ క్రమంలోనే తొలి వన్డే మ్యాచ్‌లో హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు.
తన తొలి ఓవర్ ను మెయిడిన్ గా పూర్తిచేసాడు మహమ్మద్ సిరాజ్. ఇక ఆ తర్వాత అతని బౌలింగ్ పై అంచనాలు పెరిగిపోయాయి.. ఇక అతని రెండవ ఓవర్లలో వికెట్ పడగొడతాడు అని అనుకుంటున్న సమయంలో వరుసగా రెండు బౌండరీలు చేశాడు. దీంతో సిరాజ్ ఏంటి ఇలా చేశాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇక మూడవ ఓవర్లో మాత్రం మ్యాజిక్ చేశాడు మహమ్మద్ సిరాజ్. రెండవ ఓవర్ లో తొలిబంతి ని వదిలేసి ఇక రెండు బంతును కూడా బౌండరీ కి తరలించాడు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్. అయితే సిరాజ్ ఎక్కడ నిరాశకు గురికాకుండా నాలుగో బంతి ఎంతో వైవిధ్యంగా ఇన్ స్వింగర్ వేశాడు. ఇక ఆ బంతిని ఆడిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ హోప్ చివరికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.