ఆ ఒక్క ప్లేయర్ కోసం మూడు జట్లు పోటీ... చివరికి?
ఇటీవల ఇండియాకు అయిదవ అండర్ 19 వరల్డ్ కప్ ను అందించిన యష్ దుల్ ఇప్పుడు టాక్ అఫ్ ది క్రికెట్ ఇండస్ట్రీ అయిపోయాడు. ఒక సారథిగానే కాకుండా ఆటగాడిగా కూడా విలువైన పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం యష్ దుల్ కోసం మొత్తం మూడు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. మాములుగా ఒక ప్లేయర్ కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి అంటే అతను క్రిస్ గేల్ లేదా డివిలియర్స్ అయి ఉంటారు. కానీ 20 సంవత్సరాలు కూడా లేని ఒక యువ ఆటగాడి కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద టీమ్ లు పోటీ పడుతున్నాయి.
అయితే క్రికెట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సన్ రైజర్స్ ఎలాగైనా దక్కించుకోవాలి అని వ్యూహాలు రచిస్తోందట. అయితే వీరికి ఢిల్లీ మరియు ముంబై ల నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందట. ప్రతి సీజన్ లోనూ హైద్రాబాద్ జట్టుకు నిలకడ కలిగిన ఆటగాడు లేకపోవడమే వైఫల్యానికి కారణం. అందుకే ఈ సారి ఈ లోటును పూడ్చుకోవడానికి ఎంత దార అయినా పెట్టి కొనుక్కోవాలని ప్లాన్. దీని ప్రకారం చూస్తే యష్ దుల్ 10 నుండి 15 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈ మూడు జట్లలో ఏ జట్టుకు సొంతం కానున్నాడో.