ధోని ఇచ్చిన సలహా.. ఇప్పటికీ పాటిస్తున్నా : సిరాజ్
ఒక ఆటో నడుపుకునే వ్యక్తి కొడుకు స్థాయి నుంచి ఇప్పుడు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ గర్వించే బౌలర్ స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్ లో తన సత్తా చాటి సెలెక్టర్ల తీరును ఆకర్షించిన మహమ్మద్ సిరాజ్ ఇక ఆ తర్వాత భారత క్రికెట్లో అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అద్భుతంగా రాణిస్తూ భారత జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు మహమ్మద్ సిరాజ్. ఇక టీమిండియా లోకి అడుగు పెట్టిన సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక సలహా ఇచ్చాడు అంటూ గుర్తు చేసుకున్నాడు.
టీమిండియాకు ఎంపికైన మొదటిసారి మహేంద్ర సింగ్ ధోనీ భయ్యా నాతో ఒక మాట చెప్పాడు. ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవద్దు.. మంచి ప్రదర్శన చేసినప్పుడు వాళ్లే పొగుడుతారు చెత్త ప్రదర్శన చేసినప్పుడు వాళ్లే తిడతారు. ఇలాంటివి పట్టించుకోకుండా నీ ఆట మీద దృష్టి పెట్టు నిన్ను నువ్వు వెతుక్కుంటూ వెళ్ళు ప్రశంసలు అవే వస్తాయి అంటూ ధోని చెప్పింది ఇక ఇప్పుడు నిజం అయింది అంటూ మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఏ నోటితో అయితే క్రికెటర్గా నువ్వు పనికిరావు అని అవమానించారో.. ఇక ఇప్పుడు నా ప్రదర్శన చూసి వాళ్ళు మెచ్చుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. క్రికెట్ లో నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అంటూ తెలిపాడు సిరాజ్.