కాసేపట్లో ఐపీఎల్ మెగా వేలం.. ఎక్కడ చూడొచ్చంటే?
బీసీసీఐ ముందుగా ప్రకటించిన విధంగానే ఈ మెగా వేలం అనుకున్న సమయానికి జరుగుతూ ఉండటం గమనార్హం. బెంగళూరు వేదికగా ఈ మెగా వేలం జరగబోతుంది. అయితే ఇక ఈ మెగా వేలానికి పలు స్పోర్ట్స్ ఛానల్లు లైవ్ లో ప్రసారం చేయడానికి సిద్ధమవుతున్నాయ్. ఒకవేళ మీరు కూడా మెగా వేలం ని లైవ్ లో వీక్షించాలి అనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో చూడవచ్చు. ఇందులో లైవ్ వస్తుంది. ఒకవేళ మొబైల్ లో చూడాలి అనుకుంటే హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది.
ఇకపోతే మొత్తంగా ఐపీఎల్ మెగా వేలం లో 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇందులో 370 మంది భారత ఆటగాళ్లు ఉంటే 220 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. మొత్తంగా 1214 మంది ఐపీఎల్లో ఆడేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో ఐదు వందల తొంభై మంది ఆటగాళ్లు మాత్రమే బిసిసిఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇకపోతే ఇక ఈ ఐపీఎల్ మెగా వేలంలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి మాత్రం తీవ్రమైన పోటీ ఉండటం ఖాయం అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకుల.