మెగావేలం.. చెన్నై జట్టుని ఎంపిక చేసేది అతనే?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సక్సెస్ఫుల్ జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో నాలుగుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించడంలో కెప్టెన్ ధోనీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టు అటు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా సరే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధంగా ఉంటాడు.  ఇక ఇటీవల ipl-2022 మెగా వేలం జరగబోతున్న నేపథ్యంలో ధోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తో కలిసి ఎంతో కీలకంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు.



 ఇక అంతకుముందు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజా కు మొదటి స్థానం ఇచ్చి తన స్థానాన్ని త్యాగం చేశాడు మహేంద్రసింగ్ ధోని  ఇక ఇప్పుడు మెగా వేలంలో జట్టు యాజమాన్యం తో కలిసి పాల్గొంటున్నాడు. ఇకపోతే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ యజమాని కాశీవిశ్వనాథన్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులకు నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ప్రతిసారి వేలంలో మహేంద్ర సింగ్ ధోనీ జట్టును ఎంపిక చేశాడు. ఇలా మహేంద్ర సింగ్ ధోనీ తన ఎంపిక తో అభిమానులను ఎప్పుడూ నిరాశపరిచింది లేదు.


 ధోనీ ఎప్పుడు అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తాడు అంటూ కాశీవిశ్వనాథన్  చెప్పుకొచ్చాడు. ఇకపోతే మొన్నటి వరకు ఎంతో పటిష్టంగా ఉన్న సీఎస్కే నుంచి ఎంతో మంది ఆటగాళ్లు.. మెగా వేలం లోకి వెళ్లడంతో ఇక ఇప్పుడు కొత్త ఆటగాళ్లు ఎవరు జట్టులోకి రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. నేడు, రేపు మెగా వేలం జరగబోతుండగా ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలను సిద్ధం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: