మెగావేలం.. ఎవరికీ ఎన్ని కోట్లంటే?

praveen
మెగా వేలం ప్రారంభమైంది. దీంతో ఏ జట్టు ఏ ఆటగాడిని సొంతం చేసుకుంటుందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొంతమంది టీవీల ముందు కూర్చుంటే ఇంకొంతమంది మొబైల్స్ లో ఇక ఐపీఎల్ మెగా వేలం లైవ్ వీక్షిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఈ మెగా వేలం లో భాగంగా మొదట అగ్రశ్రేణి ఆటగాళ్లు సంబంధించిన మెగా వేలం జరిగింది. ఈ క్రమంలోనే అన్నీ ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అనే చెప్పాలి. ఊహించని రీతిలో కొంత మంది ఆటగాళ్లను కొన్ని ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి.


 టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా పేరు సంపాదించుకున్న శిఖర్ ధావన్ కోసం తీవ్రమైన పోటీ జరిగింది అని చెప్పాలి. ఐపీఎల్ మెగా వేలం ఇక ఇతనితోనే షురూ అయ్యింది. ఇక చివరికి 8.25 కోట్లకి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక మొన్నటివరకు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మైన స్పిన్నర్ గా కొనసాగిన రవిచంద్రన్ అశ్విన్ ను 5 కోట్లు పెట్టి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఐపీఎల్లో స్టార్ ప్లేయర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న పాట్ కమ్మిన్స్ ను కోల్కతా నైట్రైడర్స్ జట్టు 7.25 కోట్లకు కొనుగోలు చేసింది.


 ఐపీఎల్లో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న కగిసో రబాడా ను పంజాబ్ కింగ్స్ జట్టు 9.25 కోట్లను సొంతం చేసుకుంది. ఇక మరో స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 8 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ ను తమ జట్టులోకి లాగేసుకుంది. అగ్రశ్రేణి ఆటగాళ్లలో అతి ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు శ్రేయస్ అయ్యర్. 12.25 కోట్లకు కోల్కత నైట్రైడర్స్ అతని సొంతం చేసుకుంది. షమిని 6.25 కోట్లకి గుజరాత్ టైటాన్స్.  ఫాబ్ డూప్లిసెస్  7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. క్వింటన్ డీకాక్ 6.7 కోట్ల లక్నో సూపర్ జెయింట్స్.. డేవిడ్ వార్నర్ 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: