మెగా వేలం.. తొలి ఆటగాడిని సొంతం చేసుకున్న సన్రైజర్స్?
ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే గత కొంత కాలం నుంచి హైదరాబాద్ జట్టులో వివాదాల కారణంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న సన్రైజర్స్ స్టార్ ప్లేయర్స్ ను మెగా వేలంలోకి వదిలేసింది. అయితే ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎంతోమంది కీలక ఆటగాళ్లు సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది అని అందరూ అనుకున్నారు.
అయితే మెగా వేలం ప్రారంభం అయింది. కానీ మొదటి నుంచి ఒక్క ఆటగాడిని కూడా కొనుగోలు చేయలేక పోయింది సన్రైజర్స్ యాజమాన్యం కానీ ఇటీవలే విరామానంతరం తొలి ఆటగాడిని సొంతం చేసుకుంది 8.75 కోట్లతో వాషింగ్టన్ సుందర్ ను సొంతం చేసుకుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. కాగా వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత సమయం లోనే తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు.