ఐపీఎల్ టైటిల్ విన్నర్ పక్కా ఆ జట్టే?

VAMSI
ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఎట్ట కేలకు గత రెండు నెలల నుండి ఎంత గానో ఎదురు చూసిన ఐపీఎల్ 15 సీజన్ కు సంబంధించిన మెగా వేలం నిన్నటితో ముగిసింది. ఈ సారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీనితో ఐపీఎల్ సీజన్ 15 టైటిల్ కోసం మొత్తం 10 జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 26 నుండి ఐపీఎల్ సీజన్ 15 మొదలు కానుంది. మెగా వేలంలో ముందు నుండి అనుకుంటున్నట్లుగానే కుర్ర ఆటగాళ్లకు కొనడానికి ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించారు. అంతే కాకుండా కొందరు సీనియర్ ఆటగాళ్లకు ఈ వేలంలో చుక్కెదురైంది .

ఈ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, పుజారా, ఆరోన్ ఫించ్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియన్ మాజీ ఆటగాడు మరియు చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా ఉన్న సురేష్ రైనాను కొనడానికి ఉన్న పది ఫ్రాంచైజీలలో ఎవరూ ముందుకు రాకపోవడం కొంచెం షాక్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు టీమ్ లు అన్నీ ఆటగాళ్లతో ఫిల్ అయ్యాయి. కాబట్టి ఈ సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచే సత్తా ఎవరికి ఉందనే విషయంపై అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జట్లు కూర్పును బట్టి చూస్తే ఈ సారి కొత్త ఐపీఎల్ విన్నర్ అవతరించే అవకాశం ఉంది అని క్రికెట్ పండితులు అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఐపీఎల్ గెలవని బెంగుళూరు, ఢిల్లీ మరియు పంజాబ్ లకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు జట్లలో బెంగుళూరు అని విభాగాలలో ఉత్తమమైన ఆటగాళ్లను కొనుగోలు చేసి బెంగుళూరు అభిమానుల్లో మరిన్ని ఆశలు రేపింది. మరి చూద్దాం ఏ టీమ్ ఐపీఎల్ సీజన్ 15 టైటిల్ గెలుస్తుందో...?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: