మన భాషలో.. మాక్స్ వెల్ వెడ్డింగ్ కార్డు.. మీరు చూశారా?
భారత సంప్రదాయం లో అంగరంగ వైభవం గా బంధుమిత్రుల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు ఎంతో మంది విదేశీ జంటలు.. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాక్స్వెల్ సైతం భారత సాంప్రదాయాలకు ఫిదా అయి పోయాడు అన్నది తెలుస్తుంది. విదేశీ క్రికెటర్లు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసు కోవడం చూస్తూ ఉంటాం. కానీ మాక్స్వెల్ మాత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకో బోతున్నాడు అన్నది తెలుస్తుంది.
మార్చి 27వ తేదీన విని అనే ఒక భారతీయ యువతిని పెళ్ళి చేసుకోబోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాక్స్వెల్. ఇక ఇతని వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. అయితే ఈ వెడ్డింగ్ కార్డు మన భారతీయ భాష అయినా తమిళం లో ప్రింట్ చేయడం గమనార్హం. ఇక తమిళ ఆచారం ప్రకారమే పెళ్లి మెల్బోర్న్ లో జరగబోతుంది అనేది తెలుస్తుంది. కాగా ఈ జంటకు గత ఏడాది నిశ్చితార్థం కావడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న మాక్స్వెల్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతూ ఉండటం గమనార్హం.