"సురేష్ రైనా"ను ఎందుకు కొనలేదో తెలుసా... ?

VAMSI
ఫిబ్రవరి 12 మరియు 13 వ తేదీలలో బెంగళూర్ వేదికగా ఐపిఎల్ సీజన్ 15 కోసం ప్లేయర్స్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. ఇంతకు ముందు వరకు కేవలం 8 జట్లు పోటీ పడ్డాయి. కానీ 2022 సీజన్ నుండి 10 జట్లు ఐపిఎల్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ వేలంలో దాదాపుగా అన్ని జట్లు మంచి ప్లేయర్స్ ను కొనుగోలు చేసి టైటిల్ కోసం జరిగే సమరానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వేలంలో మాజీ ఇండియా ప్లేయర్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అయిన సురేష్ రైనాకు నిరాశే ఎదురైంది. వేలంలో ఉన్న 10 ఫ్రాంచైజీలలో కనీసం ఒక్కరు కూడా ఇతనిపై బిడ్ వేయడానికి ముందుకు రాలేదు.
అయితే ఇతర జట్లు అయితే ఓకే కానీ సొంత జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా కనీస ధరకు కొనకపోవడం అభిమానులు అందరినీ ఎంతో షాక్ కు గురి చేసింది. ఈ వేలం ముగిసిన రోజు నుండి ఈ విషయంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందుకు కారణం ఏమై ఉంటుందని అభిమానులు అంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే సురేష్ రైనాను కొనుగోలు చేయకపోవడంపై కొన్ని కారణాలు బయట వినిపిస్తున్నాయి.
సురేష్ రైనా సరైన ఫామ్ లో లేక అంతర్జాతీయం ఆటకు కొంతకాలం ముందు దూరమయ్యాడు. అంతే కాకుండా గత ఐపీఎల్ కు వ్యక్తిగత కారణాల వలన దూరమయ్యాడు. ఈ కారణంగానే మానసికంగా కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడు. అదీ కాకుండా వయసు కూడా మీద పడుతుండడం కూడా ఒక కారణం కావొచ్చు అని తెలుస్తోంది. కనీసం దేహాసావలీ లీగ్ లలో అయినా సరిగా రాణించి ఉంటే ఇప్పుడు ఎవరో ఒకరు కొనడానికి ముందుకు వచ్చి ఉంటారు. కానీ అలా జరగలేదు.  అయితే ఈ మెగా వేలంలో కొనుగోలు చేసిన ఏ ఆటగాడైనా ఎక్కువ కాలం ఆ జట్టుతో ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే 35 సంవత్సరాలు ఉన్న రైనాను కొనుగోలు చేయడం అనవసరం అని భావించి ఉంటారు. ఇలా పలు కారణాలు వలన మెగా వేలంలో రైనాను ఫ్రాంచైజీలు కొనలేకపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: