ఐపీఎల్ లో పక్కన పెట్టారు.. మనసు మార్చుకున్న ఇషాంత్ శర్మ?
దీంతో ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజీ అతని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే గతంలో ఐపీఎల్ మెగా వేల నేపథ్యంలో తాను ఐపీఎల్లో ఆడతాను అని భావించిన ఇషాంత్ శర్మ రంజీ ట్రోఫీ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఐపిఎల్ లో ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయకపోవడంతో ఈ వెటరన్ పేసర్ మనసు మార్చుకున్నాడు అని తెలుస్తోంది. రంజీ ట్రోఫీ లో కి తిరిగి అందుబాటులోకి వచ్చాడు ఇషాంత్ శర్మ. రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్లో తమిళనాడు తో తలపడనున్న ఢిల్లీతో అతను చేరబోతున్నాడు
అయితే క్వారంటైన్ నిబంధనలు ఉన్న కారణంగా ఇక తొలి మ్యాచ్కు అటూ ఇషాంత్ శర్మ అందుబాటులో ఉండలేడు. ఈ నెల 24న ప్రారంభం కాబోయే ఢిల్లీ రెండవ మ్యాచ్ లో బరిలోకి దిగబోతున్నాడు ఇషాంత్ శర్మ. ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని నేపథ్యంలోనే ఇషాంత్ శర్మ మనసు మార్చుకున్నాడు అంటూ ఢిల్లీ క్రికెట్ సంఘానికి చెందిన ఒక అధికారి చెప్పడం గమనార్హం. ఇటీవలి కాలంలో భారత అంతర్జాతీయ జట్టులో మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ మంచి ప్రదర్శన కనపరిచి స్టార్ బౌలర్గా ఎదుగుతున్నారు. దీంతో 33 ఏళ్ల ఇషాంత్ శర్మకు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది.