ఓహో.. రహానే సెంచరీ చేశాడు?
ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు అయినప్పటికీ ప్రతి మ్యాచ్లో తడబడుతూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుతున్నాడు. ఇక అజింక్య రహానే పేలవ మైన ఫామ్ టీమిండియాకు మైనస్ గా మారి పోయింది. దీంతో అతని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ కూడా వచ్చాయి. ఇలాంటి నేపథ్యం లోనే ఇక అతన్ని పక్కన పెట్టేసింది బీసీసీఐ . రంజి మ్యాచ్లు ఆడాలి అంటూ అటు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా సూచించాడు. ఈ క్రమంలోనే అజింక్య రహానె తో పాటు చటేశ్వర్ పుజారా లాంటి సీనియర్ క్రికెటర్లు రంజీ మ్యాచ్ లు ఆడుతున్నారు.
ఇకపోతే మొన్నటి వరకు పేలవ మైన ఫామ్ తో నిరాశ పరిచిన అజింక్య రహానే రంజీ ట్రోఫీ లో మాత్రం అదర గొడుతున్నాడు అన్నది అర్ధమవుతుంది. ఇవాళ జరిగిన మ్యాచ్లో సెంచరీ తో ఆకట్టుకున్నాడు అజింక్య రహనే. సౌరాష్ట్ర తో జరుగుతున్న మ్యాచ్లో 211 బంతులను ఎదుర్కొన్న అజింక్య రహానే సెంచరీ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 2 సిక్సర్లు ఉండటం గమనార్హం. అజింక్య రహానే ఇదే జోరు కొనసాగిస్తే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం ఖాయం అని అంటూ అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇక రంజీ ట్రోఫీ ప్రదర్శన అజింక్య రహానే ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుంది అని చెప్పాలి.