వావ్.. తొలి మ్యాచ్లోనే త్రిబుల్ సెంచరీ?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ అసమాన్యమైన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం ఆకర్షిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా కొనసాగుతున్న వారికి సైతం సాధ్యం కాని రీతిలో యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తామే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ అని తమ ప్రతిభతో చెప్పకనే చెబుతున్నారు ఎంతో మంది యువ ఆటగాళ్లు. మొన్నటివరకు అండర్-19 ప్రపంచ కప్ లో భారత కుర్రాళ్లు ఎంత అద్భుతంగా ఆడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన ప్రదర్శన తో ఫైనల్ వరకు వెళ్లారు. ఇక ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టుపై మళ్ళీ పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించి అండర్ 19 ఇండియా జట్టును విజేతగా నిలిపారు భారత కుర్రాళ్లు. ఇక ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. ఇక ఈ రంజీ ట్రోఫీ ద్వారా ఎంతోమంది ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ను ప్రారంభించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ భారత సెలక్టర్ల చూపులు ఆకర్షిస్తున్నారు.


 ఇకపోతే ఇటీవలే అరంగేట్రం మ్యాచ్లోనే  యష్ దుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇదే అద్భుతం అనుకుంటే ఇక ఇప్పుడు ఇంతకంటే అద్భుతమైన ప్రదర్శన చేసాడు మరో ఆటగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు బీహార్ రంజీ ఆటగాడు షకీబ్ ఉల్  గని. ఇక మొదటి మ్యాచ్లోనే ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు. ఇటీవలే మిజోరాం తో జరిగిన మ్యాచ్ లో 405 బంతుల్లో 341 పరుగులు చేశాడు. ఇందులో యాభై నాలుగు ఫోర్లు 5 సిక్సర్లు ఉండటం గమనార్హం.. ఇలా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బీహార్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు నష్టానికి 686 పరుగులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: