టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ ప్రకటన.. ఎవరో కాదు?

praveen
దక్షిణాఫ్రికాలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా టెస్టు సిరీస్ లో ఘోరంగా ఓటమి చవి చూస్తుంది. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఇక  టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరు అన్నదానిపై మాత్రం తీవ్రస్థాయిలోనే చర్చ జరిగింది. వయసు ఫిట్నెస్ దృశ్య రోహిత్ శర్మను కాకుండా కె.ఎల్.రాహుల్ రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని ఎంతో మంచి మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.



 ఒకవేళ రోహిత్ శర్మకు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే అతను తరచుగా గాయాల బారినపడి జట్టుకు అందుబాటులో ఉండటం చాలా కష్టం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బిసిసిఐ ఎవరిని కొత్త టెస్ట్ కెప్టెన్ గా నియమిస్తుంది  అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఫిట్నెస్ కారణాలవల్ల రోహిత్ శర్మ కాకుండా వేరే వాళ్ళకి కెప్టెన్సీ రావడం ఖాయం అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇటీవల బిసిసీఐ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది.


 మొన్నటి వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ శర్మనే ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ కి కూడా కెప్టెన్ గా  ఎంపికయ్యాడు. ఇక భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ నియమిస్తున్నాను అంటూ ఇటీవల బిసిసీఐ సోషల్ మీడియా ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. ఇక నుంచి పూర్తిస్థాయిలో రోహిత్ శర్మ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడూ అంటూ తెలిపింది. ఇక మరికొన్ని రోజుల్లో శ్రీలంకతో టెస్ట్ టి20 సిరీస్ లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇక ఇలా టెస్ట్ కెప్టెన్ ను ప్రకటిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.



 మరికొన్ని రోజుల్లో స్వదేశంలో శ్రీలంకతో మూడు టి20లు, టెస్టులు ఆడబోతుంది టీమిండియా. అయితే ఇక పరిమిత ఓవర్ల ఫార్మటు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను కొత్త టెస్టు కెప్టెన్గా ఎంపిక చేసింది. బిసిసిఐ వైస్ కెప్టెన్గా జస్ప్రిత్ బూమ్రా ను నియమించడం గమనార్హం. అయితే టీమ్ ఇండియా లో టాప్ బౌలర్ గా ఉన్న జస్ప్రిత్ బుమ్రా కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. బీసీసీఐ ప్రకటనతో గత కొన్ని రోజుల  ఎవరు కొత్త టెస్ట్ కెప్టెన్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెర పడినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: