ఎప్పుడు నేనలా చేయలేదు.. అది చూశాక బాధేసింది : సచిన్

praveen
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పై ఎప్పుడూ ఏదో ఒక పుకారు హల్చల్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఇక ఇలాంటి వార్తలను ఎక్కువగా సెలబ్రిటీలు పట్టించుకోరు. కానీ కొన్ని కొన్ని సార్లు మితిమీరిన వార్తలతో సెలబ్రిటీలు సైతం బాధపడుతూ ఉంటారు. ఇక ఆ వార్తల గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ అసహనం వ్యక్తం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు భారత క్రికెట్లో దిగ్గజంగా కొనసాగుతున్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇక తనపై జరిగిన అసత్య ప్రచారం పై స్పందించిన సచిన్ టెండూల్కర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.



 ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు సచిన్ టెండూల్కర్. మార్ఫింగ్ ఫోటోల తో అసత్య ప్రచారం చేయడం తనను ఎంతగానో బాధ పెట్టింది అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గోవాకు చెందిన ఓ కాసినో అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకోవడంపై  లీగల్ యాక్షన్ ను సిద్ధమయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్. ఇక తన ఫొటోలను మార్ఫింగ్ చేసి బిగ్ డాడీ అంటూ కాసినో ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటుందని సచిన్ అసహనం వ్యక్తం చేశారు.



 నా ఇన్నేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా గ్యాంబ్లింగ్ కానీ టొబాకో గాని ఆల్కహాల్ ఉత్పత్తులను గానీ నేరుగా గానీ పరోక్షంగా గానీ తాను ఎప్పుడూ కూడా ఎండార్స్ చేయలేదు అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు సచిన్ టెండూల్కర్. అలాంటిది తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఫొటోలు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉండటం తనను ఎంతగానో బాధించింది అంటూ చెప్పుకొచ్చాడు. నా లీగల్ టీం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.  కానీ ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించాలని ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెడుతున్నా. తప్పుదోవ పట్టించే ఫోటోలు ఎప్పటికీ నమ్మకండి అంటూ సచిన్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: