షాకింగ్ : కోహ్లీ రికార్డ్ కు ఎసరు పెట్టిన రోహిత్?
అంతర్జాతీయ టీ20 లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు రెండవ టీ 20 మ్యాచ్లో వ్యక్తిగతంగా కెప్టెన్గా కూడా ఎన్నో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. నేడు జరుగుతున్న రెండవ టీ 20 మ్యాచ్లో మరో 19 పరుగులు చేస్తే చాలు ఏకంగా 1000 పరుగులు పూర్తి చేసుకొనున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొడతాడు. ప్రస్తుతం కెప్టెన్గా 981 పరుగులు చేసిన రోహిత్ శర్మ మరో 19 పరుగులు చేస్తే చాలు 26 మ్యాచ్లలో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లీ 30 మ్యాచ్ లలో పూర్తి చేస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ 57 మ్యాచ్ల్లో సాధించాడు. కెప్టెన్సీ పరంగా రోహిత్ శర్మకు ఇక రెండో టి-20 మ్యాచ్ గెలుపు కూడా ఎంతో కీలకం గా మారబోతుంది.
ఒకవేళ 2వ టి20 మ్యాచ్ లో రోహిత్ శర్మ విజయం సాధించాడు అంటే చాలు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డులను బద్దలు కొట్టపోతున్నాడు. దేశంలో అత్యధిక టి20 లు గెలిచిన కెప్టెన్గా చరిత్ర సృష్టించబోతున్నాడూ. ఇప్పుడు వరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియాతో 16 మ్యాచ్ లలో 15 విజయాలు సాధించింది కేన్ విలియమ్సన్ ఇయాన్ మోర్గాన్ లు సైతం స్వదేశంలో 16 మ్యాచ్ లలో 15 విజయాలు సాధించి రోహిత్ శర్మ తో సమానం గా నిలిచాడూ. శ్రీలంకతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్లో టీమిండియా గెలిచింది అంటే చాలు టి 20 లలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించబోతున్నాడూ.