వారెవ్వా రోహిత్.. మరో క్లీన్ స్వీప్?
ఈ క్రమంలోనే 3వ టి20 మ్యాచ్ లో అయినా సరే గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక జట్టు అనుకుంది. కానీ ఊహించని రీతిలో అద్భుతంగా రాణించిన టీమిండియా ప్రత్యర్థి శ్రీలంక జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా రాణించింది అనే చెప్పాలి. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. దీంతో ఇక మొదట లంక జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది శ్రీలంక జట్టు. ఇక 147 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియా అద్భుతంగా రాణించింది అని చెప్పాలి.
మరో 19 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రస్తుతం టీమిండియా పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అయితే యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇక టీమిండియా విజయం ఎంతో సునాయాసంగా మారిపోయింది అని చెప్పాలి. మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 బంతుల్లో 22 పరుగులు చేసి సహకారం అందించాడు. ఇక మొదటి సారి భారత టీ20 లో బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా 16 బంతుల్లో 21 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు..