ఐపీఎల్ : ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఏమైంది?
ఇక ఎన్నో ఫ్రాంచైజీలు మెగా వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ జట్టు పటిష్టంగా మార్చుకున్నాయ్ అని చెప్పాలి. అయితే ఐపీఎల్ 2022 నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఇది అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ లో ఉన్న పది జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపో బోతున్నాయి అన్న విషయం ఇటీవల క్లారిటీ ఇచ్చింది బిసిసీఐ. ఇలా రెండు కొత్త జట్ల ఎంట్రీ.. ఇక ఐపీఎల్ మెగా వేలంలో ప్రతి జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడంతో ఈ ఏడాది ఏ జట్టు ఎలా ప్రదర్శన చేయబోతుంది అన్నదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఇక ఇలాంటి సమయంలో ఐపీఎల్ సీజన్ నుంచి ఎంతోమంది స్టార్ ప్లేయర్ లు తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తూ ఉండటం మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్, జో రూట్ లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు.. ఇక ఇప్పుడు మరో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జెసన్ రాయ్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బయో బబుల్ వల్ల ఒత్తిడి ఎక్కువైందనీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ వివరణ ఇచ్చాడు. ఫ్యామిలీతో సమయం గడపాలని అనుకుంటున్నానని తెలిపాడు. కాగా జనవరిలో జెసన్ రాయ్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం ఇది రెండవ సారి. ఇటీవల జరిగిన మెగా వేలంలో రెండు కోట్లకు గుజరాత్ టైటాన్స్ జట్టు ఇతన్ని సొంతం చేసుకుంది.
అయితే ఒకప్పుడు ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగిన ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇటీవలి కాలంలో మాత్రం ఐపీఎల్ ను అస్సలు పట్టించుకోవడం లేదు అన్నది అర్థం అవుతుంది.. గత కొంతకాలం నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్ లు తరచూ ఐపీఎల్ డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ ఏడాది సీజన్లో కూడా బెన్ స్టోక్స్, జో రూట్ తప్పకున్నారు.. ఇప్పుడు జెసన్ రాయ్ కూడా అదే బాటలో వెళ్ళాడు. దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఏమైంది అని అనుకుంటున్నారు అభిమానులు.