ఐపిఎల్ 2022: షాక్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్య...

VAMSI
ఐపిఎల్ లో మొదటి సారి పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు గత నెలలో బెంగళూర్ లో జరిగిన మెగా వేలంలో చాలా వరకు కీలక ఆటగాళ్లను దక్కించుకుని మిగిలిన జట్లకు సవాల్ విసిరింది. ఈ జట్టుకు కెప్టెన్ గా ముంబై ఇందియన్స్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక పాండ్యను నియమించుకుంది. ఇప్పటికే ఐపిఎల్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది మరియు ఫార్మాట్ ఏమిటి అన్న విషయాలు ఐపిఎల్ పాలక మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా సరిగ్గా ఐపిఎల్ స్టార్ట్ అవడానికి 24 రోజులు మాత్రమే ఉంది. అందుకే అన్ని టీమ్ లు కూడా సన్నద్ధం అవుతున్నాయి.

కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఇంగ్లాండ్ ప్లేయర్ జాసన్ రాయ్ ఈ ఐపిఎల్ సీజన్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇతనిని గుజరాత్ వేలంలో 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు రాయ్ ఈ సీజన్ ఆడడం లేదని ప్రకటించడంతో గుజరాత్ జట్టు ఆలోచనలో పడింది. అయితే రాయ్ ఎక్కువ రోజులు బయో బబుల్ లో ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నాడట... అంతే కాకుండా జనవరిలో తన భార్య రెండవ సారి శిశువుకు జన్మను ఇచ్చింది. అందుకే తన భార్య  మరియు బిడ్డలతో సంతోషంగా గడపడానికి అధికారికంగా తెలియచేశాడు.

రాయ్ ఇలా చేయడం ఇది మొదటిసారి కాదట... గతంలో 2020 సీజన్ సమయంలో ఢిల్లీ జట్టులో ఉండగా ఆడకుండా డుమ్మా కొట్టాడు. కాగా ఇప్పుడు హార్దిక్ పాండ్యకు షాక్ అని చెప్పాలి. మరి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఎలాంటి స్టెప్ తీసుకోనుంది అన్న విషయం తెలియాలంటే కొంత సమయం వేచి చూడక తప్పదు.
ఇప్పటికే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రాయ్ పై ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: