రోహిత్ కు వార్నింగ్ ఇచ్చిన కోహ్లీ కోచ్.. ఎందుకో తెలుసా?
ఇకపోతే ఇటీవలే విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ రోహిత్ శర్మ కెప్టెన్సీ ని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్గా అతనికి ముందుంది ముసళ్ళ పండుగ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎంతో ప్రశాంతమైన కెప్టెన్ అని.. కెప్టెన్సీ చేపట్టిన కొద్ది కాలంలోనే అద్భుత విజయాలు సాధించాడని పొగుడుతూనే మరో వైపు నుంచి విమర్శలు గుప్పించాడు రాజ్ కుమార్ శర్మ. రోహిత్ శర్మ సాధించినవి సులభమైన విజయాలు అంటూ వ్యాఖ్యానించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా ఇంకా సెట్ అవ్వలేదని.. ప్రతి సిరీస్కు జట్టును మారుస్తూ ఉంటే ఇక టి20 ప్రపంచకప్ నాటికి జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది రాజ్ కుమార్ శర్మ వ్యాఖ్యానించాడు.
ఇటీవలి కాలంలో ఒక్కో ఆటగాడు ఒక్కో సిరీస్లో రాణించాడు. ఇలా రాణించిన ఆటగాళ్లకు రెస్ట్ పేరుతో పక్కకు పెట్టడం ఏ మాత్రం సరికాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇదే పరిస్థితి కొనసాగిస్తే కెప్టెన్గా రోహిత్కు శుభ పరిణామం కాదని ప్రయోగాలు చేసుకుంటూ పోతే ఏదో ఒక సిరీస్లో జట్టు బొక్క బోర్లా పడి పోవడం ఖాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడే రోహిత్ శర్మ కు అసలు పరీక్ష మొదలవుతుందని ఇప్పటికీ రోహిత్ కు ఓపెనర్లు విషయంలో ఒక క్లారిటీ లేదని తరచూ ఆటగాళ్లను మారుస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు రాజ్ కుమార్ శర్మ. ఇలా ఆటగాళ్లను మారుస్తూ పోతే ప్రపంచ కప్ లో జట్టు కూర్పు లో సమస్యలు వస్తాయి అంటూ హెచ్చరించాడు.