ఆ జర్నలిస్ట్ పేరు చెప్పేసిన సహా.. బీసీసీఐ ఏం చేస్తుందో?
ఇలాంటి సమయంలోనే ఇటీవలే వృద్ధిమాన్ సాహా బయట పెట్టిన కొన్ని విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాయి. తనను రిటైర్మెంట్ ప్రకటించాలని అంటూ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచించాడు అంటూ వృద్ధిమాన్ సాహా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాను ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పినందుకు ఒక జర్నలిస్టు బెదిరింపులకు పాల్పడ్డాడు... అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వృద్ధిమాన్ సాహా. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది.
అయితే ఆ జర్నలిస్టు పేరును బయట పెట్టలేను అంటూ గతం లో చెప్పిన వృద్ధిమాన్ సాహా.. బీసీసీఐ అధికారుల ఒత్తిడితో ఇక ఆ జర్నలిస్టు వివరాలను ఎట్టకేలకు బీసీసీఐ కి అందించినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణకు బిసిసీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీ ముందు వృద్ధిమాన్ సాహా తనను వేధింపులకు గురి చేసిన జర్నలిస్ట్ వివరాలను వెల్లడించారు. ఇక సహా చెప్పిన వివరాలను బిసిసిఐ బోర్డు దృష్టికి తీసుకెళ్తామని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ క్రమం లోనే ఆ జర్నలిస్ట్ పై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకో బోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది..