వారెవ్వా.. 35 ఏళ్ల రికార్డును.. బద్దలు కొట్టిన జడేజా?

praveen
ఇటీవలే గాయం బారినపడి భారత జట్టుకు కొన్నాళ్ళపాటు దూరమైన రవీంద్ర జడేజా.. మళ్లీ ఫుల్ జోష్ లో జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన రీ ఎంట్రీ మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు రవీంద్ర జడేజా. ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు శ్రీలంక తో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రస్తుతం భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. 163 బంతుల్లో సెంచరీ కొట్టిన రవీంద్ర జడేజా అంతటితో ఆగకుండా ఏకంగా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

 ఇక రవీంద్ర జడేజా జోరు చూస్తే తప్పకుండా డబుల్ సెంచరీ సాధించి తీరుతాడు అని అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. కానీ అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో ఇక రవీంద్ర జడేజాకు డబుల్ సెంచరీ మిస్ అయిపోయింది అని చెప్పాలి.. అయినప్పటికీ రవీంద్ర జడేజా 175 పరుగులు చేయడంతో మొత్తంగా మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి 8 వికెట్ల  నష్టానికి 572 పరుగులు చేయగలిగింది టీమిండియా. ఇక ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు రవీంద్ర జడేజా.


 175 పరుగులతో అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా ఏకంగా భారత్ క్రికెట్ లో 35 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టాడు. ఏడో స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. అంతకుముందు కపిల్ దేవ్ 1987 శ్రీలంక పై జరిగిన మ్యాచ్ లో ఏడవ స్థానంలో బరిలోకి దిగి 163 వ్యక్తిగత పరుగులు చేశాడు.. ఇక ఇప్పుడు రవీంద్ర జడేజా ఆ రికార్డును బద్దలు కొడుతూ 175 పరుగులు చేశాడు. ఇక ఇదే రేసులో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ 159 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: