మిథాలీ రాజ్ సంచలనం.. సచిన్ రికార్డును సమం చేసింది?
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల టీమిండియా మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఒకానొక సమయంలో టీమిండియా కష్టాల్లో ఉంది అనిపించినప్పటికీ చివరికి దాయాది దేశమైన పాకిస్థాన్ పై అద్వితీయమైన విజయం సాధించింది ఏకంగా 107 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రస్తుతం భారత అభిమానులందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇక ఈ మ్యాచ్‌తో అటు మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ అత్యంత అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
6 ప్రపంచ కప్ లలో ఆడిన తొలి తొలి మహిళా క్రికెటర్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లి, ఇంగ్లాండ్ క్రికెటర్ సార్లే ఎడ్వర్డ్స్ రికార్డులను బద్దలు కొట్టేసింది మిథాలీ రాజ్. అంతే కాదు ఆరు ప్రపంచ కప్ లలో ఆడిన రెండవ ఇండియన్ ప్లేయర్ గా కూడా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. భారత క్రికెట్లో దిగ్గజం లో కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ మాత్రమే 6 ప్రపంచ కప్ లకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు మిథాలీరాజ్ సచిన్ టెండూల్కర్ సరసన చేరిపోయింది.