సూపర్ న్యూస్.. సన్ రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే?
మొత్తంగా 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు అందరూ కూడా ఎదురు చూసే మ్యాచ్ మార్చి 29వ తేదీన జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ తో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. అయితే ఈసారి సరికొత్త ఆటగాళ్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ఐపీఎల్లో ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారిందిm ఇక ఐపీఎల్లో కి రెండు కొత్త జట్టు రావడంతో లీగ్ ఫార్మాట్ కాస్త కొత్తగా మారింది అన్న విషయం తెలిసిందే. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. హైదరాబాద్ జట్టు గ్రూప్ బి లో చోటు దక్కించుకుంది.
గ్రూప్ ’బి‘లో సన్రైజర్స్ తోపాటు మిగిలిన నాలుగు టీమ్స్ చెన్నై, గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ఉన్నాయ్. ఈ జట్లతో రెండేసి చొప్పున మ్యాచ్ లను ఆడనుంది. అదే సమయంలో గ్రూప్ ’ఎ‘లో కోల్ కతా నైట్ రైడర్స్ తో రెండు మ్యాచ్ లను ఆడి... మిగిలిన నాలుగు జట్లతో ఒక్కోసారి తలపడనుంది సన్రైజర్స్ .