డూప్లెసిస్ కాదు.. ఆర్సిబి కెప్టెన్గా కొత్త పేరు?
ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఇక విరాట్ కోహ్లీ తర్వాత కొత్త కెప్టెన్ ఎవరు కాబోతున్నాడు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఇటీవల జరిగిన మెగా వేలంలో ప్రపంచ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు ఫాబ్ డూప్లెసిస్ ను కొనుగోలు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కాబోయే కెప్టెన్ అతనే అంటూ టాక్ వినిపించింది. అతను కాకపోతే మ్యాక్స్వెల్ కెప్టెన్గా అవతరిస్తాడు అని మరికొంతమంది కూడా భావించారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా దినేష్ కార్తీక్ పేరు ఇక ఇప్పుడు తెరమీదికి వచ్చింది. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం దినేష్ కార్తీక్ సొంతం. దీంతో బెంగళూరు జట్టు యాజమాన్యం అతని వైపు మొగ్గు చూపుతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఇటీవల జరిగిన మెగా వేలంలో 5.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది బెంగళూరు యాజమాన్యం. అయితే కొత్త కెప్టెన్ ఎవరు అనే దానిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం తెరమీదికి ముగ్గురు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో చివరికి కొత్త కెప్టెన్ ఎవరు అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది