ఐపీఎల్ : ఆస్ట్రేలియా కెప్టెన్ కి లక్కీ ఛాన్స్?
ఈ క్రమంలోనే ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోని సరకు గానే మిగిలి పోయారు ముఖ్యంగా ఆస్ట్రేలియన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫామ్ లేని కారణంగా వయసుపైబడిన దృశ్య కూడా అతని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అభిమానులను నిరాశ లో మునిగిపోయారు.. ఇలాంటి సమయంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ బయో బబుల్ ఒత్తిడి కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆరోన్ ఫించ్ కి లక్కీ ఛాన్స్ వచ్చింది అని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ బెస్ట్ ప్రైస్ 1.5 కోట్లకు సొంతం చేసుకోవడం గమనార్హం. గతంలో ఏకంగా 8 ఐపీఎల్ ఫ్రాంఛైజీల కు ఆడిన అనుభవం ఆరోన్ ఫించ్ కు ఉండడం గమనార్హం. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు ఈ స్టార్ ప్లేయర్. ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు 87 మ్యాచ్లు ఆడి 25.7 సగటుతో రెండు వేల ఐదు పరుగులు చేశాడు ఆరోన్ ఫించ్. ఇక ఎట్టకేలకు ఆరోన్ ఫించ్ ని ఐపీఎల్ లో కోల్కత్తా కొనుగోలు చేయడంతో మళ్లీ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు..