ఐపీఎల్ : జంపు జిలానీల లిస్ట్ ఇదే?

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్లో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడు అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. కొంత మంది ఆటగాళ్లు ప్రతి ఏడాది ఓకే జట్టును అంటి పెట్టుకుంటే.. మరికొంతమంది మాత్రం ఇక ప్రతి సారి కూడా జట్టును మారడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలా ఐపీఎల్లో జట్టు మారినా వారి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


 ఐపీఎల్ లో జంపు జిలానీల గురించి మాట్లాడాలి అంటే ముందుగా వచ్చే పేరు ఆరోన్ ఫించ్. ప్రస్తుతం ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు ఆరోన్ ఫించ్. అయితే కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ అలెక్స్ హెల్స్ ఐపీఎల్కు దూరమవడంతో అతని స్థానాన్ని దక్కించుకుని కోల్కతా జట్టు లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కోల్కతా  ఆరోన్ ఫించ్ కి  9వ జట్టు  కావడం గమనార్హం. 2010లో తొలిసారి రాజస్థాన్ తర్వాత ఢిల్లీ అటు వెంటనే పూనే, సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించాడు ఆరోన్ ఫించ్.


 ఒకే జట్టుకు పరిమితం కాకుండా వరుసగా జట్లు మారుతున్న వారిలో శ్రీలంక ప్లేయర్ తిసారా పేరేరా కూడా ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఏకంగా ఆరు జట్లకు ఆడాడు. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత కొచ్చి టవర్డ్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్,   పూణే లకు ఆడాడు. ఏ జట్టులోనూ తగిన గుర్తింపు సంపాదించుకోలేక పోయాడు.


 ఇక ఇలాంటి జంపు జిలానీల లో పార్థివ్ పటేల్ మూడవ స్థానంలో ఉండడం గమనార్హం. ఇతను కూడా ఐపీఎల్ లో ఆరు జట్లకు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మొదలుపెట్టి టస్కర్స్, డెక్కన్ చార్జెస్, సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడాడు.


 ఇక ఇషాంత్ శర్మ కి కూడా ఈ జంపు జిలానీల లిస్టులో పేరు ఉంది. కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో తన ఐపీఎల్ ప్రస్థానం మొదలు పెట్టి ఆ తరువాత డెక్కన్ చార్జెస్, సన్రైజర్స్ హైదరాబాద్,   పూణే, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ఆడాడు. ఇప్పుడు ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు

 ఇర్ఫాన్ పఠాన్ సైతం ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లో ఐపిఎల్ జర్నీ ప్రారంభించి అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ సూపర్ జెంట్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ఆడాడు.


 యువరాజ్ సింగ్ సైతం ఐపీఎల్ లో 6 జట్లకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. తొలుత పంజాబ్ కెప్టెన్గా ఆ తర్వాత పూణే వారియర్స్ సారథిగా అనంతరం బెంగుళూరు, ఢిల్లీ, సన్రైజర్స్ హైదరాబాద్, చివరగా ముంబై ఇండియన్స్ జట్లకు ఆడాడు


 దినేష్ కార్తీక్ ముందుగా ఢిల్లీ డేర్ డెవిల్స్ లో ఐపియల్ ప్రయాణాన్ని మొదలు పెట్టి అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడటం గమనార్హం.. ఇక ఇప్పుడు బెంగళూరు జట్టులో కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: