98 బంతుల్లో 92 పరుగులు.. శ్రేయాస్ ఖాతాలో చెత్త రికార్డు?
ఒకవైపు పిచ్ బౌలర్లకు బాగా అనుకూలిస్తూ ఉన్న నేపథ్యంలో భారత బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కుప్పకూలిపోతుంది. ఇలాంటి ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇక ఒంటరి పోరాటం చేశాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతంగా ఆడి 98 బంతుల్లో 92 పరుగులు చేశాడు. కానీ 8 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ఈ 92 పరుగులతో శ్రేయస్ అయ్యర్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని అర్థమవుతుంది. టెస్ట్ ఫార్మాట్లో 90 పరుగులు పూర్తి చేసిన తర్వాత స్టంప్ అవుట్ అయిన నాలుగవ భారత ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఇప్పటివరకు భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరో దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ సహా దిలీప్ వెంగ్సర్కార్ కూడా టెస్టు ఫార్మాట్లో 90 పరుగులు చేసిన తరువాత స్టంప్ ఔట్ అయిన ఆటగాళ్లు గా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు 90 పరుగులు చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ పూర్తి చేస్తాడు అని అనుకుంటున్న సమయంలో స్టంప్ అవుట్ అయ్యి ఇక పెవిలియన్ చేరడం గమనార్హం. ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరికి శ్రేయస్ అయ్యర్ ఖాతాలో ఒక చెత్త రికార్డ్ చేరుకోవడంతో అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కాగా మొదట 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్ అనే విషయం తెలిసిందే..