హార్థిక్ పాండ్యా ఐపీఎల్ కు దూరం కాబోతున్నాడా.. ఏం జరుగుతుంది?

praveen
హార్దిక్ పాండ్యా.. మొన్నటి వరకు భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగాడు. టీమిండియా ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన కూడా అటు భారత జట్టులో హార్దిక్ పాండ్యా మాత్రం ఎప్పుడూ చోటు దక్కించుకుంటూ ఉండేవాడు. ప్రతి మ్యాచ్లో కూడా అటు బౌలింగ్ తో అదరగొట్టడమే కాదు బ్యాటింగ్ లో కూడా తనకు తిరుగు లేదు అని నిరూపించే వాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే విధంగా తన ఆటతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవాడు. ఇక జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి భారీ సిక్సర్లు ఫోర్లు కొట్టడం లాంటివి చేసేవాడు హార్దిక్ పాండ్యా. అద్భుతమైన ప్రతిభతో ఎంతోమంది  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.


 అయితే అలాంటి హార్దిక్ పాండ్యా కొంతకాలం నుంచి మాత్రం టీమిండియాకు పూర్తిగా దూరం అయిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్థిక్ పాండే మళ్లీ కోలుకొని రీ ఎంట్రీ ఇచ్చాడు.. కానీ ఆ తర్వాత మాత్రం బౌలింగ్ కి పూర్తిగా దూరం అయిపోయాడు. ఇక బ్యాటింగ్ లో కూడా పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఉంటూ గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా  ఇటీవలే ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాతి టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు కూడా నిర్వహించబోతున్నాడు.


 ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ముందు ఒక అతి పెద్ద సవాలు ఉంది అని చెప్పాలి. అదే ఫిట్నెస్ టెస్ట్ నిరూపించుకోవడం. కొంతకాలం నుంచి ఫిట్నెస్ లోపం కారణంగా ఇబ్బంది పడుతున్న హార్దిక ఇప్పుడు తప్పనిసరిగా ఫిట్నెస్ నిరూపించుకోవలసిన సమయం వచ్చింది. ఒకవేళ ఇక ఈ టెస్టులోఫెయిల్ అయితే మాత్రం ఐపీఎల్లో ఆడటానికి బిసిసీఐ అతనిని అనుమతించదు. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను ఉండబోతున్నాడు. కొంతకాలం నుంచి ప్రతీ ఆటగాడికి ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి అయింది అన్న విషయం తెలిసిందే.  సీనియర్ ప్లేయర్ లు  సైతం తప్పనిసరిగా ఈ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దీంతో ఏం జరగబోతుందో అని ప్రస్తుతం అభిమానులందరూ ఆందోళనలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: