ప్రతీకారానికి సమయం వచ్చింది.. ఇండియా రెడీ?
సరిగ్గా ఐదేళ్ల క్రితం అద్భుతమైన ఆట తీరుతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది టీమిండియా మహిళల జట్టు. ఇక టైటిల్ పోరులో ప్రత్యర్థి ఇంగ్లాండ్ టీమిండియాపై విజయాన్ని అందుకుంది. ఇక చివరి వరకు పోరాడిన మిథాలీ సేన కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలై రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నాటి మ్యాచ్ తర్వాత ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ లో ఇరు జట్లు ముఖాముఖీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఐదేళ్ల నాటి ప్రతీకారాన్ని టీమిండియాకు ఇప్పుడు తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఇక ఎవరిది ఆధిపత్యం సాగిపోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
అయితే ఇప్పటివరకూ వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచులలో చూస్తే ఇంగ్లాండ్ కంటే భారత జట్టు ఫామ్ మెరుగ్గా ఉంది అని చెప్పాలి. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడినప్పటికీ పాకిస్తాన్ వెస్టిండీస్ లపై సాధించిన విజయాలు మాత్రం జట్టు ఎంత పటిష్ట స్థితిలో ఉందో చెప్పకనే చెబుతున్నాయి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఖాతా తెరువ లేక పోయింది. ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది.. దీంతో ఇక ఈ సారి టీమిండియా మహిళల జట్టు ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించడం అనే ఖాయం అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇటీవలే టీమిండియా బ్యాటర్లు స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ లు మంచి ఫాంలోకి వచ్చ సెంచరీ చేయడంతో ఇక టీమిండియా మహిళల జట్టుకు తిరుగులేదు అని అంటున్నారు టీమిండియా అభిమానులు..