అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్రతి ఒక్క క్రికెటర్ కి కొన్ని కలలు ఉంటాయి. ఒక్కసారి అయినా వరల్డ్ కప్ వచ్చిన జట్టులో తమ పాత్ర ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందులోనూ ఇక ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వారు అయితే తాము కెప్టెన్ గా వుండగానే జట్టుకు వరల్డ్ కప్ టైటిల్ ను అందించాలని ఆశ పడుతారు. ఇప్పుడు సరిగ్గా ఇదే ప్రాసెస్ లో ఇండియా మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా 12 వ మహిళల వన్ డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే సగానికి పైగా టోర్నమెంట్ జరిగిపోయింది. గత వన్ డే వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వెళ్లి కప్ సాధించలేక చతికిలపడ్డ మిథాలీ సేన ఈ సారి అయినా ఆ కలను సాకారం చేసుకోవాలని టోర్నీలో అడుగు పెట్టింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇండియా 4 మ్యాచ్ లు ఆడింది. ఈ రోజు ఇంగ్లాండ్ తో ఆడిన నాలుగవ మ్యాచ్ లో ఘోరపరాజయం చెందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 131 పరుగులకు కుప్పకూలింది. చేదనను ఆరంభించిన ఇంగ్లాండ్ 6 వికెట్లు కొలోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో ఆడిన 4 లో 2 మ్యాచ్ లు గెలిచి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఇక మిగిలింది కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే. అయితే లీగ్ స్టేజ్ నుండి సెమీస్ కు చేరాలంటే మూడు మ్యాచ్ లు ఖచ్చితంగా గెలవాల్సి వస్తుంది. ఇక ఆడాల్సిన మూడు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ లతో ఆడుతుంది. అయితే ప్రస్తుతం ఇండియా ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే మూడు గెలవడం దాదాపు అసాధ్యమే. మరి సెమీస్ కనుక చేరుకోకపోతే మిథాలీ రాజ్ కల కరిగిపోయినట్లే. మిథాలీ రాజ్ ఆడుతున్న ఆఖరి వరల్డ్ కప్ ఇదే కావడంతో వరల్డ్ కప్ సాధించాలని అనుకుంటోంది. మరి ఏదైనా అద్బుతం జరిగి ఇండియా సెమీస్ కు చేరుతుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉంది.