ఐపీఎల్లో అవమానం.. చివరికి షాకింగ్ నిర్ణయం?
కేవలం అప్పుడప్పుడే మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తూ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయారు.. అలా ఆన్ సోల్డ్ గా మిగిలి పోయిన వారిలో అటు భారత క్రికెటర్లు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే క్యాష్ రిచ్ లింక్ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా చేయకుండా ఇక ప్రత్యామ్నాయ మార్గాలను క్రికెటర్లు వెతుక్కుంటున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా ఇంగ్లాండ్తో జరిగే కౌంటీలు ఆడేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
మరో టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి ధాక ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు అన్నది తెలుస్తుంది. హనుమ విహారి తో పాటు ఈ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు మరో ఏడుగురు భారత ప్లేయర్ లు కూడా ఒప్పందం చూసుకున్నారు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే డక ప్రీమియర్ లీగ్ లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు భారత ఆటగాళ్లు. అయితే భారత ప్లేయర్లకు విదేశీ లీగ్ లలో పాల్గొనే అవకాశం లేదు. అయితే డిపిఎల్ బంగ్లాదేశ్ ఏ లిస్ట్ ఆఫ్ క్రికెట్ టోర్నీలో భారత క్రికెటర్లకు అనుమతి ఉంది. దీంతో డి పి ఎల్ లో భారత క్రికెటర్లు పాల్గొనడం కొత్తేమీ కాదు.